BIKKI NEWS (SEP. 29) : World heart day September 29th. ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 29 న జరుపుకుంటారు.
World heart day September 29th
ఈ దినోత్సవమును ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ రోజున ప్రతి ఒక్కరు గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొంటారు.
గుండెపోటు, గుండె జబ్బులను నివారించడంకోసం 1946లో జెనీవా దేశంలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంస్థ ఏర్పాటయింది. 1999లో అప్పటి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరిపాడు. అలా 2000 నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది.
2010 వరకు సెప్టెంబరు నెలలోని ఆఖరి ఆదివారం నిర్వహించబడిన ఈ దినోత్సవం, 2011వ సంవత్సరం నుంచి సెప్టెంబరు 29వ తేదీన నిర్వహించబడుతోంది.