IND vs PAK ఆసియా కప్ విజేత భారత్

BIKKI NEWS (SEP. 29) : ASIA CUP CRICKET 2025 WON BY INDIA. భారత్ ఆసియా కప్ క్రికెట్ 2025 విజేతగా నిలిచింది. ఫైనల్ దాయాది పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించి ఆసియా కప్ ను గెలుచుకుంది.

ASIA CUP CRICKET 2025 WON BY INDIA

భారత బ్యాట్స్మెన్ తిలక్ వర్మ (69*)అజేయ పోరాటంతో భారత్ వరుసగా రెండోసారి ఆసియా కప్ ను గెలుచుకుంది. మొత్తం మీద 9వ సారి విజేతగా నిలిచింది.

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 19.1 లోనే 146 పరుగులకు అలౌట్ అయింది కులదీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో తిలక్ వర్మ తన పోరాటంతో 19.4 ఓవర్లలోనే జట్టూనూ గెలిపించాడు. తిలక్ వర్మకు సంజు శాంసన్ (24) చూసే (33) సహకారం అందించారు.

ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ 21 కోట్ల నజరానాను ప్రకటించింది.

ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ వర్మ నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా అభిషేక్ వర్మ నిలిచాడు.

ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్ జట్లు మూడుసార్లు తలపడగా మూడుసార్లు టీమిండియానే విజేతగా నిలవడం విశేషం.

ఆసియా కప్ విజేతలు
1984 – ఇండియా
1986 – శ్రీలంక
1988- ఇండియా
1991 – ఇండియా
1995 – ఇండియా
1997 – శ్రీలంక
2000 – పాకిస్తాన్
2004 – శ్రీలంక
2008 – శ్రీలంక
2010 – ఇండియా
2012 – పాకిస్తాన్
2014 – శ్రీలంక
2016 – ఇండియా
2018 – ఇండియా
2022 – శ్రీలంక
2023 – ఇండియా
2025 – ఇండియా

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK