MGBS CLOSED -ఎంజీబీఎస్ కు ప్రయాణికులు రావోద్దు

BIKKI NEWS (SEP. 27) : MGBS CLOSED DUE TO MUSI RIVER FLOODS. హైదరాబాద్ లోని మూసీ నది వరదల కారణంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోకి వరద నీరు చుట్టుముట్టడంతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ను తాత్కాలికంగా మూసివేశారు.

MGBS CLOSED DUE TO MUSI RIVER FLOODS.

ఎంజీబీఎస్ నుంచి బయలుదేరాలనుకునే ప్రయాణికులు బస్ స్టాండ్ కి రావొద్దని TGSRTC సూచించింది.

ప్రత్యామ్నాయంగా పలు ఇతర బస్ స్టాండ్ లో నుండి జిల్లాలకు బస్ లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి మాత్రమే బయలుదేరుతాయి.

వరంగల్, హన్మకొండ వైపు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి బయలుదేరుతాయి.

సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపునకు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి .

మహబూబ్ నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయని పేర్కొంది.