BC RESERVATIONS – బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు

BIKKI NEWS (SEP. 26) : 42% RESERVATIONS FOR BCs in Telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రారంభించింది.

42% RESERVATIONS FOR BCs in Telangana

తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన G.O.Ms.No.09 ద్వారా గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (BCs) 42% సీట్లు మరియు పదవులను రిజర్వ్ చేయాలని నిర్ణయించింది.

నవంబర్ 2024లో ఏర్పాటు చేసిన కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తంలో BC ల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ స్థాయిలపై సర్వే నిర్వహించబడింది. కమిషన్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో BC జనాభా సుమారు 56.33% ఉంది .

2025లో రాష్ట్ర అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఈ రిజర్వేషన్ బిల్లు ను ఆమోదించిన సంగతి తెలిసిందే.