NSP : ఒకే దరఖాస్తు అనేక స్కాలర్షిప్ లు

BIKKI NEWS (SEP. 22) : One application for all scholarships by NSP portal. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే వారు అర్హత కలిగిన అన్ని స్కాలర్షిప్ లు వారి బ్యాంకు ఎకౌంటు లో ఇకనుండి జమ కానున్నాయి‌.

One application for all scholarships by NSP portal.

ఇకనుండి పలు రకాల ఉపకార వేతనాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం విద్యార్థులకు లేదు.

ఇందుకనుగుణంగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో మార్పులు, చేర్పులు చేశారు. ఈ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి, విద్యార్థి ఏయే ఉపకారవేతనానికి అర్హుడవుతాడో గుర్తించి, వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు .

ఈ పోర్టల్ లో దరఖాస్తు చేసే సందర్భంలో విద్యార్థులు తమ విద్యా ర్హతల ధ్రువీకరణ పత్రాలతో పాటు వార్షికాదాయం, తమ కేటగిరీ ధ్రువీకరణ సర్టిఫికేట్ల జిరాక్స్ ప్రతులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

వెబ్సైట్ : https://scholarships.gov.in/