IND vs PAK – నేడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్

BIKKI NEWS (SEP. 21) : INDIA PAKISTAN MATCH TODAY IN ASIA CUP. ఆసియా క్రికెట్ కప్ 2025లో భాగంగా ఈరోజు భారత్ పాకిస్తాన్ జట్లు సూపర్ ఫోర్ లో మ్యాచ్ లో భాగంగా తలబడనున్నాయి.

INDIA PAKISTAN MATCH TODAY IN ASIA CUP.

గ్రూప్ దశలో ఇప్పటికే పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత జట్టు, ఈ మ్యాచ్ లో కూడా గెలిచి ఫైనల్ అవకాశాన్ని మెరుగుపరచుకోవాలని చూస్తుంది.

మొన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు సభ్యులు ఎవరు పాకిస్తాన్ జట్టు సభ్యులతో షెక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ మ్యాచ్ లో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవచ్చు అని తెలుస్తుంది.

అయితే ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది. సోనీ లో లైవ్ ప్రసారం కానుంది.

ఇప్పటివరకు ఆసియా కప్ లో టీట్వంటీ ఫార్మాట్ లో 3 సార్లు తలపడగా భారత్ 2 సార్లు , పాకిస్తాన్ ఒక్కసారి విజయం సాధించాయి.

మరోవైపు మొత్తం మీద 14 సార్లు టీట్వంటీ లలో తలపడగా 11 భారత్, 3 పాకిస్థాన్ గెలిచాయి.

భారత జట్టు అంచనా : అభిషేక్, గిల్, సూర్యకుమార్, తింక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

పాకిస్థాన్ జట్టు అంచనా : సాహిబ్ జాదా ఫర్హాన్, సయమ్ ఆయూజ్, మహ్మద్ హారిష్, పకార్ జమాన్, సల్మాన్ అఘా, హసన్ నవాజీ, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అప్రాప్, షహీన్ ఆఫ్రిది, సుఫియాన్ ములీమ్, అబ్రార్ అహ్మద్.