SBI SCHOLARSHIP – 9వ తరగతి నుండి పీజీ వరకు స్కాలర్షిప్

BIKKI NEWS (SEP. 20) : SBI SCHOLARSHIP 2025 FOR 9th to PG Students. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్బీఐ ఫౌండేషన్, ఈ ఏడాదికి ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ లకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది.

SBI SCHOLARSHIP 2025 FOR 9th to PG Students

దేశవ్యాప్తంగా 23,230 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ లను అందజేస్తారు.

అర్హతలు : 9 నుండి పీజీ వరకు గుర్తింపు పొందిన విద్యా సంస్థలో చదువుతూ ఉండాలి.

9వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఇది వర్తిస్తుంది.

విలువ : ఎంపికైనవారికి సంవత్సరానికి రూ.15 వేల నుంచి 20 లక్షల వరకు (కోర్సు పూర్తయ్యేదాకా) అందిస్తారు. 2025-26 ఏడాదికి ఈ స్కాలర్షిప్ కింద రూ.90 కోట్లను ఎస్బీఐ అందించనుంది.

2022లో తీసుకొచ్చిన ఈ స్కాలర్షిప్ ద్వారా వెనకబడిన వర్గాలకు ఉన్నత విద్యను చేరువచేస్తున్నట్లు తెలిపింది.

దరఖాస్తు గడువు : నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : http://www.sbiashascholarship.co.in/