BIKKI NEWS (SEP. 19) : DEPUTATIONS in GOVERNMENT JUNIOR COLLEGES. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీ పోస్టులకు డిప్యుటేషన్ పద్ధతిలో లెక్చరర్లను కేటాయిస్తున్నట్లు సమాచారం.
DEPUTATIONS in GOVERNMENT JUNIOR COLLEGES.
అదే జిల్లాల్లోని పోస్టులకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా ప్రస్తుతం పనిచేస్తున్న చోట మూడు రోజులు.. డిప్యుటేషన్ వేసిన చోట మరో మూడు రోజులు పాఠాలు బోధించాలని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం .
రాష్ట్ర వ్యాప్తంగా 25 నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, అందులో ఏడు కళాశాలలకు మాత్రమే ప్రభుత్వం పోస్టులను మంజూరు చేసింది.
మిగిలిన 18 కళాశాలల్లో పోస్టులకు గెస్టు ఫ్యాకల్టీని తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఇంటర్ కమిషనరేట్ అధికారులు ప్రతిపాదనలు చేశారు. కానీ, ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దానికి అనుమతి ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో డిప్యుటేషన్ పై లెక్చరర్లకు అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లు సమాచారం.