DASARA HOLIDAYS – కళాశాలలకు 25 నుంచి దసరా సెలవులు

BIKKI NEWS (SEP. 18) : DASARA HOLIDAYS FROM 25th SEPTEMBER. తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ మరియు ఫార్మా కళాశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్ 25 నుండి ప్రకటించారు. మొదట ఈ సెలవులు సెప్టెంబర్ 28 నుంచి ప్రకటించారు.

DASARA HOLIDAYS FROM 25th SEPTEMBER

సాంకేతిక విద్యా శాఖా విడుదల చేసిన నూతన ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 05 వరకు పాలిటెక్నిక్ మరియు ఫార్మా కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. దీంతో మొత్తం దసరా సెలవులు 11 రోజులు ఉండనున్నాయి.

పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 03 వరకు దసరా సెలవులు ప్రకటించారు.

అలాగే ఇంటర్మీడియట్ కళాశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 05 వరకు ప్రకటించారు.