BIKKI NEWS (SEP. 17) : Telangana Intermediate admissions 2025. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్మిషన్ల చేసుకోవడానికి ఒక్క రోజు సెప్టెంబర్ 17వ తేదీన అవకాశం కల్పించారు.
Telangana Intermediate admissions 2025.
2025 – 26 విద్యా సంవత్సరం కొరకు ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు పొందటానికి విద్యార్థులకు ఈ ఒక్కరోజు అవకాశం కలదు.
ప్రైవేట్ జూనియర్ కళాశాలలో 1000 రూపాయలు ఆలస్య రుసుముతో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు పొందవచ్చు.
అలాగే విద్యార్థులకు తమ వివరాలను ఎడిట్ అవకాశాన్ని కూడా కల్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచితంగా, ప్రైవేటు జూనియర్ కళాశాలలో 250 రూపాయల రుసుముతో తణ వివరాలు ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇది కూడా ఈ ఒక్కరోజు మాత్రమే అవకాశం కలదు.