GJC ADMISSIONS – ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పెరిగిన అడ్మిషన్లు

BIKKI NEWS (SEP. 16) : Admissions in Government junior colleges 2025. ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య తీసుకుంటున్న పలు సంస్కరణలు ఈ ఏడాది అడ్మిషన్ల రూపంలో ఫలితం ఇచ్చింది.

Admissions in Government junior colleges 2025

ప్రభుత్వ జూనియర్ కళాశాలల 430 ఉండగా..వాటిలో 92,117 మంది ఫస్టీయర్ లో అడ్మిషన్లు పొందారు‌. అంటే గతేడాదితో పోలిస్తే 8.482 ఎక్కువ అడ్మిషన్లు నమోదయ్యాయి..

రాష్ట్రంలో మొత్తం 3,292 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉండగా.. ఈ విద్యాసంవత్సరం 5,01,129 మంది ఫస్టియర్ లో అడ్మిషన్లు పొందారు.

1,350 ప్రైవేటు జూనియర్ కళాశాల్లో ల అడ్మిషన్లు ఈ విద్యా సంవత్సరం తగ్గాయి. గతేడాది 3.39.176 మంది చేరగా.. ఈ ఏడాది 3,14,371 మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. గతేడాదితో పోలిస్తే ఏకంగా 24805 అడ్మిషన్లు తగ్గాయి,

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతుల కల్పన, కొత్తగా జూనియర్ లెక్చరర్లను నియమించడంతోపాటు ఫిజిక్స్ వాలా వంటి కార్పొరేట్ సంస్థలతో జేఈఈ, నీట్, ఎఫ్‌సెట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇప్పిస్తుండటమే కారణమని అధికారులు తెలిపారు.