BIKKI NEWS (SEP. 13) : Indiramma cheerala kanuka for telangana women. తెలంగాణ మహిళలకు బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ఇందిరమ్మ చీరల కానుక పేరుతో ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Indiramma cheerala kanuka for telangana women.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 60 లక్షల మంది మహిళలకు ఉచిత చీరలను అందజేయనున్నట్లు తెలిపారు.
ఉచిత చీరల కార్యక్రమం సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
ఒక్కొక్క చీర తయారికి 800 రూపాయలు ఖర్చయినట్లు మంత్రి తెలిపారు. సిరిసిల్ల నేతన్నలు ఈ చీరల తయారీ కార్యక్రమాన్ని 8 నెలల ముందు ప్రారంభించారని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి, మంత్రులు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
మెఫ్మా, సెర్ప్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు కూడా చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.