BIKKI NEWS (SEP. 08) : US OPEN MEN’S SINGLES WINNER ALCARAZ. యూఎస్ ఓపెన్ 2025 గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ కార్లోస్ అల్కారాస్ గెలుచుకున్నాడు. ఫైనల్ లో ఇటలీ ఆటగాడు జన్నిక్ సినెర్ ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో సినెర్ ఓడించాడు.
US OPEN MEN’S SINGLES WINNER ALCARAZ.
2022 లో యూఎస్ ఓపెన్ ను తొలిసారి గెలుచుకున్న అల్కరాజ్ మరల ఈ ఏడాది రెండోసారి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
మొత్తం మీద అల్కరాజ్ కు ఇది 6వ గ్రాండ్ స్లామ్ టైటిల్. కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ తప్ప మిగిలిన మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్ లను రెండేసి సార్లు గెలుచుకున్నాడు.
ఈ ఏడాది ఫ్రెంచ్ మరియు యూఎస్ ఓపెన్ లను గెలుచుకున్నాడు.
యూఎస్ ఓపెన్ (2022, 2025)
వింబుల్డన్ (2023, 2024)
ఫ్రెంచ్ ఓపెన్ (2024, 2025)