Aadhar update – విద్యార్థుల ఆధార్ అప్డేట్ తప్పనిసరి

BIKKI NEWS (AUG. 29) : AADHAR UPDATE COMPULSORY FOR 1- 15 YEARS STUDENTS. దేశవ్యాప్తంగా ఉన్న అన్నిపాఠశాలల్లో 5-15 ఏళ్ల విద్యార్థుల ఆధార్ వివరాలను తక్షణమే అప్డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆధార్ సంఖ్య లేని విద్యార్థులకు తల్లిదండ్రులు త్వరగా నమోదు చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆదేశాలు జారీ చేసింది.

AADHAR UPDATE COMPULSORY FOR 1- 15 YEARS STUDENTS.

ప్రస్తుతం ఆధార్ సంఖ్యలు ఉన్నా కూడా బయోమెట్రిక్స్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేశారు. పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి విద్యార్థుల ఫోటో, ఐరిస్, ఫింగర్ ప్రింట్స్ వంటి వివరాలను సేకరించాలని ప్రభుత్వ సూచనలు వచ్చాయి. దీంతో పాఠశాలల్లో ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ఈ చర్య వల్ల విద్యార్థుల భవిష్యత్‌లోని స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పోటీ పరీక్షల దరఖాస్తులు, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి అంశాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని కేంద్రం సూచించింది.