CPGET 2025 EXAMS SCHEDULE విడుదల

BIKKI NEWS (JULY 12) : CPGET 2025 EXAMS SCHEDULE . తెలంగాణ రాష్ట్రంలోని 8 యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న సిపిగెట్ 2025 పరీక్షల షెడ్యూలు విడుదల చేశారు.

CPGET 2025 EXAMS SCHEDULE

ఆగస్టు 8 నుండి 11వ తేదీ వరకు సీపీ గెట్ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు.

మొత్తం 45 సబ్జెక్టులలో ఈ పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సీపీ గెట్ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి జూలై 17 వరకు అవకాశం కలదు.

500/- రూపాయల ఆలస్య రుషముతో జూలై 24 వరకు, 2 వేల రూపాయల ఆలస్య రుసుముతో జూలై 28 వరకు దరఖాస్తుకు అవకాశం కలదు.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు సీపీగెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://cpget.tgche.ac.in/