81 మంది జేఎల్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతుల ఆదేశాలు జారీ

BIKKI NEWS (JULY 14) : 81 JLs promoted as principals. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలిలో నేడు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యా శాఖ కార్యదర్శి మరియు సంచాలకులు శ్రీ కృష్ణ ఆదిత్య గారు 81 మంది అర్హులైన జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్‌గా పదోన్నతుల ఆదేశాలు జారీ చేశారు.

81 JLs promoted as principals.

ఈ కార్యక్రమానికి పరీక్షల నియంత్రణాధికారి శ్రీమతి జయప్రదా బాయి గారు, మెద్చల్ మరియు రంగారెడ్డి జిల్లాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు (DIEOs) హాజరయ్యారు.

పదోన్నతి పొందిన లెక్చరర్లను డైరెక్టర్ అభినందిస్తూ, వారు తమ కొత్త బాధ్యతలను నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. విద్యారంగాన్ని మెరుగుపరిచే దిశగా నాయకత్వ భాద్యతల్ని సమర్థంగా నెరవేర్చాలని ఆకాంక్షించారు.

పదోన్నతుల ప్రక్రియలో ప్రతిభకు, సేవలకు ప్రాధాన్యం ఇస్తూ, పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామని డైరెక్టరేట్ మరోసారి హామీ ఇచ్చింది.