BIKKI NEWS (DEC. 01) : 5000 DUPLICATE EMPLOYEES IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లో ఏకంగా 5 వేల మందికి పైగా డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్టు తేలింది ఆర్థిక శాఖ బయట పెట్టింది.
5000 DUPLICATE EMPLOYEES IN TELANGANA
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను.. ఆధార్ కార్డుతో లింక్ చేయడంతో ఈ డూప్లికేట్ ఉద్యోగుల డేటా బయటకు వచ్చింది.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిలో అసలు అక్కడ ఉద్యోగులే లేకుండా పేర్లు సృష్టించడం ఒక ఎత్తు అయితే, ఒకే వ్యక్తి పేరుతో రెండు, మూడు చోట్ల జీతాలు తీసుకుంటున్న విషయం బయటపడింది.
ప్రభుత్వంలో పర్మినెంట్ ఉద్యోగం చేస్తున్న వారు సైతం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా తాత్కా లిక ఉద్యోగులుగా నమోదైనట్టు అధికారులు గుర్తించారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం.. కేవలం ఈ డూప్లికేట్ ఉద్యోగుల జీతాల పేరిట ప్రతినెల దాదాపు రూ.25 కోట్లు పక్కదారి పడుతున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో 5,21,692 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, వారికి సమానంగా అంటే 5 లక్షల మందికి పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. డూప్లికేట్ ఉద్యోగులను ఏరివేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు తావులేకుండా ఉద్యోగ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది.
ఇకపై జీతాల చెల్లింపులో మాన్యువల్ విధానానికి స్వస్తి పలికి పూర్తిస్థాయిలో ‘డిజిటల్ మానిటరింగ్’ వి ధానాన్ని అమల్లోకి తేనున్నది. ప్రతీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయడంతోపాటు బయోమెట్రిక్ హాజరు ఆధా రంగానే వేతనాలు చెల్లించేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఈ చర్యలతో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు ఆదా కావడంతోపాటు అర్హు లైన వారికి న్యాయం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

