2023 BATCH JLs – ఇంటర్ డైరెక్టర్ ను కలిసిన అధ్యాపకులు

BIKKI NEWS (SEP. 04) : 2023 batch JLs meet Intermediate Director. 2023 బ్యాచ్ రెగ్యులరైజ్డ్ అధ్యాపకుల సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇతర సమస్యల పరిష్కారం కొరకు గౌరవ తెలంగాణ ఇంటర్ విద్య డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ఐఏఎస్ గారితో TGJLA_475 సమావేశం కావడం జరిగింది.

2023 batch JLs meet Intermediate Director.

తెలంగాణ రాష్ట్రంలోని పనిచేస్తున్న 3200 మంది నూతన అధ్యాపకులకు సంబంధించిన రెండవ ఇంక్రిమెంట్ మరియు ఎఫ్ఏసి ప్రిన్సిపాల్ విధులు మరియు ఇతర సమస్యల గురించి హైదరాబాదులో గౌరవ ఇంటర్ విద్య డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య గారితో సమావేశమై పలు సమస్యలను వారి దృష్టికి తీసుకుళ్లినట్టు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్_475 రాష్ట్ర అధ్యక్ష /ప్రధాన కార్యదర్శులు ,డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.

హైదరాబాదులో ఇంటర్ విద్య కార్యాలయంలో సంఘ గౌరవ సలహాదారు డాక్టర్ అందే సత్యం గారి ఆధ్వర్యంలో తమ సంఘం కలిసి క్రింది విషయాలను గౌరవ ఇంటర్ విద్య డైరెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.

  • 2023 batch నూతన అధ్యాపకులకు రెండవ ఇంక్రిమెంట్ వెంటనే చేయాలి
  • UGC గుర్తింపు ఉండి అధర్ స్టేట్ యూనివర్సిటీలో పీజీ చేసిన వారి సర్టిఫికెట్లు వెంటనే వెరిఫికేషన్ చేయాలని, రోస్టరు రిజర్వేషన్ పాయింట్లు కేటాయించి ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేయాలి.
  • FAC ప్రిన్సిపాల్ విషయంలో సీనియర్లకు అవకాశం కల్పించాలి.
  • 2023 మే నెలలో క్రమబద్ధీకరించబడ్డ అధ్యాపకులను RCJL కాకుండా 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్స్ గా తదుపరి ఏ ఉత్తర్వులు లోనైన పేర్కొనాలి.
  • నూతన అధ్యాపకులకు మెడికల్ అండ్ స్పాంజ్ అవసరం ఉన్నవారికి OD/DEPUTION సౌకర్యం కల్పించాలి.
  • ఈ మధ్యకాలంలో ఇంటర్ విద్యా డైరెక్టర్ నుంచి వచ్చిన మోడల్ టైం టేబుల్ వలన కింది స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కరించాలి.
  • ఇంటర్ బోర్డు నుంచి నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసెస్ సాయంత్రం మూడు గంటల నుంచి నిర్వహించాలి.
  • 2024 సెలవులలో పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది, అధ్యాపకులకు, ELs సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలి.
  • గత సంవత్సరం పని చేసిన కాంట్రాక్టు /పార్ట్ టైం /గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకుల రెన్యువల్ ఉత్తర్వులు విడుదల చేసి ఐదు నెలల వేతన బకాయిలు చెల్లించాలి.
  • ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ,విద్యార్థులకు ఏకరూప దుస్తులను మరియు ఐడెంటి కార్డులను పంపిణీ చేయాలి.
  • నూతన అధ్యాపకులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కొరకు గౌరవ ఇంటర్ విద్యా కార్యాలయంలో మరియు ఆర్జెడి ఆఫీసులో ప్రత్యేకంగా ఆఫీసర్ ను ఏర్పాటు చేయాలి.

ఇంటర్ విద్య డైరెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ… వారం రోజులలో వీటికి సంబంధించిన విషయాలను తెలియజేస్తామని తెలియజేస్తూ, ఏ ఒక్క అధ్యాపకునికి నష్టం జరగదని ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ, కళాశాలలో విద్యార్థుల అటెండెన్స్ పెంచడానికి సహకరించాలని అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు సక్రమంగా కొనసాగడానికి త్వరలో ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు డిజిటల్ బోర్డులు త్వరలో పంపిస్తామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేసి ఆర్థిక నిధులు తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నామని తెలుపుతూ అధ్యాపకులు అధికారులు అందరూ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా గౌరవ ఇంటర్ విద్య డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ఐఏఎస్ గారికి, ఆర్జెడి జయప్రదబాయి మేడమ్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయన శ్రీనివాస్, సాయిలు, కేపీ శోభన్ బాబు, సంగీత, విశాలాక్ష్మి, రాష్ట్ర జిల్లా నాయకులు గంగాధర్, సందీప్ కుమార్, పాతూరి రాజిరెడ్డి, డాక్టర్ ఎల్లా స్వామి, అత్తినేని శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు.