1 BALL 22 RUNS VIDEO – ఒక్క బంతికి 22 పరుగులు

BIKKI NEWS (AUG. 27) : 1 BALL 22 RUNS BY SHEPHERD VIDEO. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మెన్ షెఫర్డ్ ఒక్క బంతికి 22 పరుగులు రాబట్టి రికార్డు సృష్టించాడు.

1 BALL 22 RUNS BY SHEPHERD VIDEO.

గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడుతున్న షెఫర్డ్ సెయింట్ లూయిస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 15వ ఓవర్ లోఈ అద్భుతాన్ని చేశాడు

బౌలర్ థామస్ 15 ఓవర్లో మూడవ బంతికి నోబాల్ వేయడంతో పరుగు లేమి చేయని షెఫర్డ్, ఫ్రీ హిట్ బాల్ వైడ్ పోవడంతో మరో ఫ్రీ హిట్ బాల్ ను సిక్స్ గా మలిచాడు .

అయితే ఆ బాల్ కూడా నోబాల్ కావడంతో మరో ఫ్రీ హిట్ లభించింద. దీనిని బౌండరీగా మలిచాడు షెఫర్డ్.

ఈసారి మళ్ళీ అదృష్టం కలిసి వచ్చింది. ఆ బాల్ కూడా నోబాల్ కావడంతో మరో ఫ్రీ హిట్ ను బౌలర్ వేయగా దానిని సిక్స్ గా మలిచాడు.

దీంతో ఒక్క లీగల్ బాల్ కు 22 పరుగులు వచ్చినట్లు అయింది.

3 NO BALLS 3 RUNS
1 WIDE BALL – 1 RUN
2 SIXES – 12 RUNS
1 FOUR – 4 RUNS